దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గురువారం దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో కురువ కృష్ణమ్మ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే
కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.