దేవరకద్ర: రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

1చూసినవారు
దేవరకద్ర: రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర-డోకూర్ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం ఉదయం 9:30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. దేవరకద్ర ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం అతను మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రైల్వే ఎస్ఐ 8712658597 నంబర్ ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్