దేవరకద్ర: వాహనాలు ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

3చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోప్లాపూర్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి సింధనూరు వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో, అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పెళ్లి బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు ప్రయాణికులతో పాటు లారీ, డీసీఎం డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :