దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన రేషన్ కార్డులు అందిస్తున్నామని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం దేవరకద్ర మండల కార్యాలయ ఆవరణలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.