దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుక్రవారం మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు. నియోజకవర్గానికి చెందిన నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.