మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని గాదిర్యాల గ్రామంలో మంగళవారం డాక్టర్ వెన్న ఈశ్వరప్ప విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. గాదిర్యాల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర, ప్రేరణాత్మక కథలు, నైతిక విలువలను తెలియజేసే పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పుస్తకాలు విద్యార్థుల్లో పఠనాసక్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం, ఉన్నతమైన ఆలోచనలను పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం
విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నవెన్న ఈశ్వరప్పను ఘనంగా సన్మానించారు.