ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఎఐయంఎ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డాక్టర్ అశ్విని నవదీప్ నియమితులయ్యారు. హనుమకొండలోని యంజియం ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న నవదీప్, వైద్య విద్యార్థుల సమస్యలు, జూనియర్ వైద్యుల డిమాండ్ల పరిష్కారంలో ఆయన సేవలను గుర్తించి ఈ నియామకం జరిగింది. తెలంగాణ నుంచి ఎఫ్ఎఐయంఎ కార్యవర్గంలో స్థానం దక్కడం గర్వంగా ఉందని నవదీప్ తెలిపారు.