దసరా పండుగ రోజున కౌకుంట్ల మండల కాంప్లెక్స్ కు భూమి పూజ

4చూసినవారు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మండల కార్యాలయాలు ఇంకా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని, ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఎమ్మెల్యే కలిసి నిధుల గురించి కోరగా సానుకూలంగా స్పందించి, కౌకుంట్ల మండల కాంప్లెక్స్ నూతన భవన నిర్మాణానికి ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తక్షణమే రూ. 16 కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. నూతన మండల కాంప్లెక్స్ నిర్మాణానికి రాబోయే దసరా పండుగ రోజున భూమి పూజ నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.

సంబంధిత పోస్ట్