మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 60 డివిజన్లకు మొత్తం 347 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 127 మంది స్వతంత్ర అభ్యర్థులు కావడం విశేషం. కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 58, బీజేపీ 52 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం, జనసేన, బీఎస్పీ కూడా బరిలో ఉన్నాయి. స్వతంత్రుల పోటీ పెరగడంతో ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది.