దేవరకద్ర: 'కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు'

59చూసినవారు
దేవరకద్ర: 'కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు'
దేవరకద్ర మండల కాంగ్రెస్ నాయకులపై శనివారం దేవరకద్ర పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులను పురుష పదజాలంతో దూషిస్తూ గుద్దిచంపుతాం అంటూ బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్