కౌకుంట్ల: ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు... రాకపోకలు బంద్

2652చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కౌకుంట్ల మండలం కేంద్రంలోని కౌకుంట్ల-ఇస్రంపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనితో శనివారం కౌకుంట్ల-ఇస్రంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ కారణంగా ఇరు గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, వర్షాలు తగ్గితేనే రాకపోకలు పునరుద్ధరించబడతాయని స్థానికులు తెలిపారు.