రేపు మహబూబ్ నగర్ కు కేటీఆర్.. ఏర్పాట్ల పరిశీలన
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, ఎంబీసీ క్రీడా మైదానంలో సభ ప్రాంగణాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఏర్పాట్లను వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించిన ఆయన, టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొంటారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు.
