శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున ఎస్పీ డి.జానకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపాలిటీల్లోని కేంద్రాలను సందర్శించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులు, అనుచరులు శాంతియుతంగా సహకరించాలని కోరారు.