మహబూబ్ నగర్: అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు సిద్ధం

2చూసినవారు
మహబూబ్ నగర్: అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు సిద్ధం
మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు సన్నిధిలో ఆదివారం నుంచి మార్చి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అంకురార్పణంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం, గరుడ వాహనసేవ, మంగళవారం విమాన రథోత్సవం జరగనున్నాయి. అయితే, చంద్రగ్రహణం కారణంగా ఈసారి కళ్యాణోత్సవాన్ని రద్దు చేశారు. గ్రహణం రోజున ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 వరకు ఆలయ ద్వారబంధనం ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్