మహబూబ్ నగర్: వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

4చూసినవారు
మహబూబ్ నగర్: వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ
వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ ఎస్పీ డి. జానకి బుధవారం సూచించారు. పిల్లలను చెరువులు, కాలువలకు దూరంగా ఉంచాలని, మైనర్లకు వాహనాలు అప్పగించరాదని హెచ్చరించారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే డయల్ 100కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :