మహబూబ్ నగర్ పట్టణంలో ఆదివారం సాయంత్రం, ఇటీవల మరణించిన ఒక నాయకుడిపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ఆగ్రహించిన 11 మంది యువకులు ఒక యువకుడిని చితకబాదారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం, యుద్ధంలో మరణించిన నాయకుడిపై యువకుడు చేసిన కామెంట్ పై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, బీజేపీ శ్రేణులు మంగళవారం డీఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించి, దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.