శనివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, తన కుటుంబ సభ్యులతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ దేవిని దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న కలెక్టర్ కు ఆలయ అర్చకులు, ఈఓ దీప్తి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మంగళ హారతి ఇచ్చి, శేష వస్త్రంతో సత్కరించి, వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.