నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. జడ్చర్లలో 14 మంది, కోయిలకొండలో 8 మంది, నారాయణపేటలో 86 మందిపై కేసులు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 43 మంది వాహనదారులపై, బహిరంగంగా మద్యం తాగిన 29 మందిపై కేసులు నమోదైనట్లు ఎస్పీలు వినీత్, శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఒక్కరోజే మొత్తం 151 కేసులు నమోదయ్యాయి.