మహబూబ్ నగర్ పట్టణంలోని కోయిల్ కొండ చౌరస్తాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మామిడిపండ్ల లోడ్ తో వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు హన్వాడ మండలం లింగన్నపల్లి గ్రామానికి చెందిన ఎర్ర బాలప్పగా గుర్తించారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.