మహబూబ్ నగర్ జిల్లాలో, రాంనగర్ బాలికల హైస్కూల్ లో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప, మద్యం టెండర్లలో పాల్గొని ధర్మాపూర్ వైన్ షాపును దక్కించుకున్నారు. ప్రభుత్వోద్యోగి అయ్యుండి టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నందుకు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. విచారణ అనంతరం శుక్రవారం డీఈఓ ప్రవీణ్ కుమార్ ఆమెను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది.