దేవరకద్ర మండలం గోపన్పల్లికి చెందిన వన్నెం ఆంజనేయులు (26) అప్పుల బాధతో తన పొలం వద్ద రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదేళ్ల కిందట లావణ్యను వివాహం చేసుకున్న ఆంజనేయులు, కౌలుకు తీసుకున్న భూమిలో వేరుసెనగ, పత్తి సాగు చేయగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.8 లక్షల అప్పు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన మృతిని తట్టుకోలేక మామ బోయ మొగులయ్య కూడా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది.