మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ సమీపంలోని రామాలయం వద్ద విద్యుత్ షాక్ తో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ ను తాకడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మృతుడి వివరాల కోసం గాలిస్తున్నారు. ఎస్ఐ శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.