పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినాన, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తో కలిసి లోక కల్యాణార్థం, ప్రజా శ్రేయస్సు కోసం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి కృపతో ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెలుగులా విరాజిల్లాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.