మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శనివారం దుబాయ్ పర్యటనకు వెళ్లారు. దుబాయ్ ఏయిర్ పోర్టులో ఐపీఏఫ్ ప్రతినిధులు, దుబాయ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఐపీఏఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాలలో పాల్గొనేందుకు ఆమె ఆహ్వానాన్ని మన్నించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు.