మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీఓ అనిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.