మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మంగళవారం అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన హాస్పిటల్లో ప్రస్తుత ప్రభుత్వం పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. జిల్లాకు చెందిన ఎంతోమంది పేద ప్రజలు క్యాన్సర్, గుండె జబ్బులతో మరణిస్తున్నారని, హాస్పిటల్ ను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.