మహబూబ్ నగర్: హోంగార్డుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఎస్పీ

7చూసినవారు
మహబూబ్ నగర్: హోంగార్డుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఎస్పీ
మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ హోంగార్డుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని శుక్రవారం ఎస్పీ డి. జానకి తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హోంగార్డులు రఫీయుద్దీన్ భార్య, కంకిరెడ్డి కుమారుడి వైద్య ఖర్చుల కోసం సంక్షేమ నిధి నుంచి రూ. 10 వేల చొప్పున రీయింబర్స్మెంట్ చెక్కులను అందించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే వారికి ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్