పండుగ సాయన్న జీవితాన్ని వక్రీకరించేలా రూపొందుతున్న “హరిహర వీరమల్లు” సినిమా వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. అవమానించేలా సినిమా తీశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శివ ముదిరాజ్, ప్రజా వీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్ర రచయిత జనార్ధన్, పీయూ బీసీ సంఘం అధ్యక్షుడు తాయప్ప, బహుజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.