మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, పిఏసి నెంబర్ జె. కుసుమ్ కుమార్ అధ్యక్షతన గురువారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం పాటిస్తూ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, యువతకు పార్టీ పదవులలో పెద్దపీట వేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే పార్టీ పదవుల్లో కీలక ప్రాధాన్యం ఉంటుందన్నారు.