దేవరకద్ర నియోజకవర్గం టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాధిఖ్ కీలక రాజకీయ వ్యాఖ్యలు గురువారం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారం దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన 'కొంగ జపం'తో పోల్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనతో ప్రజల మన్ననలను పొందుతోందని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారని, ప్రతిపక్షాలు అనవసరంగా అధికారం కోసం వెంపర్లాడుతున్నాయని ఆయన విమర్శించారు.