పోల్కంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

0చూసినవారు
పోల్కంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైంది. గ్రామ పార్టీ అధ్యక్షులుగా ముద్దని సురేష్, ఉపాధ్యక్షులుగా తప్పేట అన్నమయ్య, బడుగుల రాజు కార్యదర్శులుగా, ఓబీసీ అధ్యక్షులుగా బైకని మహేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా బైకని శ్రీశైలం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పుర కురమూర్తి, ఉపాధ్యక్షులుగా పందెం ప్రతాప్, మైనారిటీ అధ్యక్షులుగా యండి. సిరాజ్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ షోహెబ్ (ముత్తు) ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్