ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాటం - మహమ్మద్ సాధిఖ్

2చూసినవారు
ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాటం - మహమ్మద్ సాధిఖ్
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌లో బుధవారం టీపీసీసీ మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాధిఖ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి ఓటును కాపాడేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఓటర్ల జాబితా లోపాలు, ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకతపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్