మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి నిర్వహించనున్న రథోత్సవానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు, భక్తుల కోసం క్యూలైన్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. భక్తులు సహకరించి వేడుకను శాంతియుతంగా జరపాలని ఆయన కోరారు.