సుందరీమణుల పిల్లలమర్రి సందర్శనకు భారీ బందోబస్తు: ఎస్పీ జానకి

75చూసినవారు
సుందరీమణుల పిల్లలమర్రి సందర్శనకు భారీ బందోబస్తు: ఎస్పీ జానకి
72వ 'మిస్ వరల్డ్' పోటీలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన 22 మంది కంటెస్టెంట్లు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని సందర్శిస్తున్న సందర్భంగా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. గురువారం పిల్లలమర్రిలో కంటెస్టెంట్లు సందర్శించే రాజరాజేశ్వరీ దేవాలయం, జిల్లా మ్యూజియం, పిల్లలమర్రి మహావృక్షం పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. 980 మంది పోలీస్ సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్