పేద ప్రజల సొంతిల్లు ఉండాలనే కలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో ఉప్పరి మల్లమ్మ నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇల్లు జీవితంలో ఒక భాగస్వామ్యమని, ఆ కలను ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చిందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.