మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేస్తామని టిఆర్ఎస్ అబ్జర్వర్ గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. జిల్లా ఇన్‌చార్జి మెట్టుకాడి ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం టీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని, రాజ్యాధికారం సాధించి తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేందుకు పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.