Jan 29, 2026, 16:01 IST/
మేడారంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం (వీడియో)
Jan 29, 2026, 16:01 IST
మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. గద్దెల దగ్గరి నుంచి పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకెళ్లి కారులో కరీంనగర్‌కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే వీణవంక మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన భార్య, కూతురు, కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొనడంతో ఉద్రిక్తత నెలకొంది.