Feb 14, 2026, 01:02 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
కొల్లాపూర్: పట్టు నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి
Feb 14, 2026, 01:02 IST
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సంచలన విజయం సాధించింది. కొల్లాపూర్ ఎమ్మెల్యే, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి తన పట్టును నిలబెట్టుకున్నారు. మొత్తం 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 16 వార్డులలో అభ్యర్థులను గెలిపించి సత్తా చాటగా, బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించారు. బీజేపీ ఖాతా తెరవలేదు.