తిరుపతిలో గద్వాల జిల్లా యువకుడు మృతి

75చూసినవారు
తిరుపతిలో గద్వాల జిల్లా యువకుడు మృతి
గద్వాల జిల్లాకు చెందిన యువకుడు తిరుపతిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం కొంకలకి చెందిన చాకలి స్వాముల చిన్న కుమారుడు వీరేశ్ తిరుపతిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. రైలు పట్టాలపై అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆధార్ కార్డు ఆధారంగా అతడు గద్వాల వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్