జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి-44 పై మారుతి స్విఫ్ట్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.