గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం సింగవరం సర్పంచ్ గొంగళ్ళ ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ, సర్పంచ్
ఎన్నికలు జరిగి 5 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా నిధులు ఒక్క రూపాయి కూడా రాలేదని, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే సరిపోతున్నాయని ఆయన అన్నారు.