అలంపూర్: బైక్‌లో మంటలు... తృటిలో తప్పిన ప్రమాదం!

0చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్ మండల కేంద్రంలో సోమవారం సెంటర్ బ్యాంక్ సమీపంలో ఓ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. మంటలను గమనించిన వెంటనే వాహనదారుడు అప్రమత్తమై బైక్‌ను నిలిపివేశారు. సమీపంలో నీళ్లు అందుబాటులో ఉండటంతో స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్