జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గేటుకు రైతులు గురువారం తాళం వేసి నిరసన తెలిపారు. మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, పంటను అమ్ముకున్నా, గన్ని సంచులు, వాహనాల బాధ్యత తమదేనని అధికారులు చెప్పడం తమను ఆవేదనకు గురిచేసిందని రైతులు తెలిపారు. పందుల బెడద, చలి, తుపాను వల్ల పంటను నిల్వ ఉంచుకోలేకపోతున్నామని, అధికారులు స్పందించి రోజువారీగా మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.