ఎర్రవల్లి: లారీని ఢీకొన్న వోల్వో బస్సు.. ఆరుగురికి గాయాలు

1567చూసినవారు
ఎర్రవల్లి: లారీని ఢీకొన్న వోల్వో బస్సు.. ఆరుగురికి గాయాలు
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కోదండపూర్ సమీపంలో జాతీయ రహదారి (NH-44)పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి, ఒకరి కాలు విరిగింది. మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను తరలించే చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్