తిమ్మప్పస్వామి ఆలయంలో భక్తుల గోవింద నామస్మరణతో ప్రత్యేక పూజలు

1596చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండల కేంద్రం సమీపంలోని బింగిదొడ్డి పెద్ద చెరువు కట్ట కింద వెలిసిన తిమ్మప్పస్వామి ఆలయంలో గురువారం గోవింద నామస్మరణతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త కుండలో నైవేద్యం వండి స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మల్దకల్ తిమ్మప్ప ఉత్సవాల్లో భాగంగా దాసంగాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభతో కిక్కిరిసింది.
Job Suitcase

Jobs near you