శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం పుల్లూరు స్టేజీ-పంచలింగాల గ్రామాల మధ్య 44వ జాతీయ రహదారిపై కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.