ఉండవెల్లి మైనార్టీ పాఠశాలలో చదువుతున్న ఆటో డ్రైవర్ మాలిక్ కుమార్తె తహసీన్, 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. గురువారం మానవపాడులో జరిగిన ఓ కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆమెను ప్రత్యేకంగా అభినందించి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.