అలంపూర్: హరీశ్ రావు, కేటీఆర్ పై సంపత్ కుమార్ పరువునష్టం దావా

1519చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి ఎస్ఏ సంపత్ కుమార్ బుధవారం నాంపల్లి మనోరంజన్ ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్, కొన్ని మీడియా సంస్థలపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసి, పరువు తీశారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తానని సంపత్ కుమార్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్