జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో వినూత్న దృశ్యం కనిపించింది. తమ ఎన్నికల గుర్తు 'గ్యాస్ పొయ్యి' కావడంతో, అభ్యర్థి రాజేశ్వరి సత్య ఆదివారం నాడు గ్యాస్ స్టవ్ ను నెత్తిన పెట్టుకుని ప్రచారం చేశారు. ఆమె ఈ వినూత్న ప్రచార తీరు స్థానికులను ఆకట్టుకుంది. ఉదయం నుంచి ఈ విధంగానే ప్రచారం కొనసాగించడంతో, పలువురు నవ్వులు చిందించారు.