అలంపూర్: ఒకే రోజు 2ఎంట్రన్స్ పరీక్షలు గందరగోళంలో విద్యార్థులు

3చూసినవారు
అలంపూర్: ఒకే రోజు 2ఎంట్రన్స్ పరీక్షలు గందరగోళంలో విద్యార్థులు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండల పరిధిలోని విద్యార్థులు మే 3న TGRJC, KGBV ప్రవేశ పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు ఒకేరోజు రావడంతో ఏ పరీక్షకు హాజరవ్వాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఒక పరీక్ష రాస్తే, మరో మంచి అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, తక్షణమే పరీక్ష తేదీలలో మార్పులు చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్